అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

  • కరీంనగర్​జిల్లా పాతర్లపల్లిలో ఘటన 

జమ్మికుంట, వెలుగు : బిడ్డల పెండ్లిళ్ల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్​జిల్లా ఇల్లందకుంట మండలం పాతర్లపల్లికి చెందిన నందికొండ కుమార స్వామి(45) కి రెండెకరాల పొలం ఉంది. అతడికి భార్య, ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉన్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమైనా ఆడపిల్లలిద్దరినీ ఇంటర్​వరకు చదివించాడు. 

మంచి సంబంధాలు రావడంతో రెండేండ్ల కింద ఓ బిడ్డది, గత సంవత్సరం మరో బిడ్డ పెండ్లి చేశాడు. పెండ్లిళ్ల కోసం రూ.3.50 లక్షల అప్పు తీసుకువచ్చాడు. ఉన్న రెండెకరాల్లో  వరి, పత్తి వేయగా దిగుబడి సరిగ్గా రాక నష్టాలు వచ్చాయి. దీంతో కూలి పనికి వెళ్తున్నాడు. ఎంత పని చేసినా వచ్చే డబ్బులు బతకడానికే సరిపోకపోవడంతో కలత చెందాడు. 

వడ్డీలు పెరగడం, కట్టేదారి లేక మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఇంటి దగ్గర పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి వరంగల్​ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారన్నారు.

జమ్మికుంట, వెలుగు : బిడ్డల పెండ్లిళ్ల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్​జిల్లా ఇల్లందకుంట మండలం పాతర్లపల్లికి చెందిన నందికొండ కుమార స్వామి(45) కి రెండెకరాల పొలం ఉంది. అతడికి భార్య, ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉన్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమైనా ఆడపిల్లలిద్దరినీ ఇంటర్​వరకు చదివించాడు. మంచి సంబంధాలు రావడంతో రెండేండ్ల కింద ఓ బిడ్డది, గత సంవత్సరం మరో బిడ్డ పెండ్లి చేశాడు. పెండ్లిళ్ల కోసం రూ.3.50 లక్షల అప్పు తీసుకువచ్చాడు. ఉన్న రెండెకరాల్లో  వరి, పత్తి వేయగా దిగుబడి సరిగ్గా రాక నష్టాలు వచ్చాయి. దీంతో కూలి పనికి వెళ్తున్నాడు. ఎంత పని చేసినా వచ్చే డబ్బులు బతకడానికే సరిపోకపోవడంతో కలత చెందాడు. వడ్డీలు పెరగడం, కట్టేదారి లేక మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఇంటి దగ్గర పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి వరంగల్​ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారన్నారు.