అప్పుల బాధతో  రైతు ఆత్మహత్య.. మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో ఘటన

మెదక్ (కౌడిపల్లి), వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామానికి చెందిన రైతు కర్రోళ్ల వెంకట్రాములు (47) తనకున్న మూడెకరాల పొలాన్ని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పంట పెట్టుబడికి, బోర్లు వేయించేందుకు రూ.5 లక్షలు అప్పు తీసుకున్నాడు.

ఏడాది కిందట ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌లో ట్రాక్టర్ కొన్నాడు. కొన్నేండ్లుగా పంట దిగుబడి సరిగా రాక అప్పులు తీర్చలేకపోయాడు. దీంతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు నర్సాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలిం చగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.