
హాలియా, వెలుగు: అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలంలోని తుర్కొనిబావి గ్రామంలో శనివారం జరిగిందీ ఘటన. గుర్రంపోడ్ ఎస్‌ఐ శీనయ్య తెలిపిన వివరాల ప్రకారం.. శంకరయ్య (48) అనే రైతు పంట పెట్టుబడి కోసం కొంతమంది దగ్గర నుంచి రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఈ ఏడాది అనుకున్నంత దిగుబడి రాలేదు. అలాగే కూతురి పెండ్లి కోసం రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పు ఎలా తీర్చాలో తెలియక, జీవితం మీద విరక్తితో తన పొలంలోని మామిడి చెట్టుకు శంకరయ్య శనివారం సాయంత్రం ఉరి వేసుకున్నాడు. కొడుకు ప్రశాంత్ ఇచ్చిన కంప్లైంట్‌తో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్గొండలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.