పాము కాటుతో రైతు మృతి

పాము కాటుతో రైతు మృతి
  • ఖమ్మం జిల్లా కట్టకూరులో ఘటన

ముదిగొండ, వెలుగు: పాము కాటుతో రైతు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. ముదిగొండ మండలం కట్టకూరుకు చెందిన వల్లూరి రుక్మారెడ్డి(40)కి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సోమవారం సాయంత్రం అతడు తన పొలానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ పాము కాటు వేసింది. 

దీంతో రుక్మారెడ్డి చెరువు అవతల వైపు ఉన్న తన మావ వెంకటరెడ్డిని కేకలు వేసి పిలిచాడు. అతడు చెరువు చుట్టూ తిరిగి వచ్చి చూసే సరికి రుక్మారెడ్డి పరిస్థితి విషమించింది. వెంటనే ఖమ్మంలోని హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.