పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. వన్య ప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా మంథని మండలం గోపాల్ పూర్ గ్రామ శివారులో వన్య ప్రాణుల కోసం అక్రమంగా అమర్చిన విద్యుత్ తీగలను అమర్చాడు ఓ రైతు. ఈ క్రమంలోనే పక్క పొలానికి వెళ్లాల్సిన జెట్టి కృష్ణ అనే మరో రైతు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు.
కృష్ణ తన పొలం వద్దకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుని స్వగ్రామం మంథని మండలం బిట్టుపల్లి. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు.