జనగామ జిల్లాలో విషాదం.. ట్రాక్టర్తో పొలం దున్నుతుంటే..

  • జనగామ జిల్లా కట్కూరులో ఘటన

బచ్చన్నపేట,వెలుగు : ట్రాక్టర్​ కిందపడి రైతు చనిపోయిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన రైతు మ్యాక లింగం(35) ఆదివారం సాయంత్రం ట్రాక్టర్​తో తన పొలం దున్నుతున్నాడు. వరంపై నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారి ట్రాక్టర్ కిందపడ్డాడు.

దీంతో అతనిపై నుంచి కేజ్​వీల్​వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. బచ్చన్నపేట పోలీసులు డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.