చిలప్ చెడ్, వెలుగు: మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం జగ్గంపేటలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు నాగన్నోల్ల పోచయ్య(50) కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులతో పాటు వ్యవసాయానికి చేసిన అప్పులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. వాటిని తీర్చే మార్గం కనబడక మనస్థాపానికి గురై సోమవారం సాయంత్రం బయటికి వెళ్తున్నానని చెప్పి, తమ్ముడు శ్రీను పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆచూకీ కోసం వెతుకుతుండగా, మంగళవారం డెడ్‌బాడీ కనిపించింది. మృతుడికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ఎస్సై నర్సింహులు ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతుడి భార్య శేఖమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.