
ధర్మపురి, వెలుగు: వడ్లు తూకం వేసి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా అకౌంట్ లో డబ్బులు పడలేదని ఓ రైతు వినూత్న నిరసన తెలిపాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కోసునూరుపల్లె గ్రామానికి చెందిన విక్రమ్ రెడ్డి అనే రైతు రెండు నెలల క్రితం తీగల ధర్మారం సెంట్లో 30 బస్తాల వడ్లు అమ్మాడు. కొన్ని రోజుల తర్వాత రోజూ బ్యాంకుకు వెళ్లి కనుక్కుంటున్నా అకౌంట్లో మాత్రం డబ్బులు పడలేదు. దీంతో విసిగిపోయి సర్కారు తీరుకు నిరసనగా గురువారం దున్నపోతుకు వినతిపత్రం అందజేశాడు. ఇప్పటికైనా ఆఫీసర్లు డబ్బులు వచ్చేలా చూడాలని కోరాడు. గ్రామంలో ఇంకా 25 మందికి డబ్బులు రావాల్సి ఉంది.