పెగడపల్లి, వెలుగు : జగిత్యాల జిల్లాలో పొలం దున్నుతుండగా ట్రాక్టర్బోల్తా పడి రైతు చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామానికి చెందిన సిలివేరు తిరుపతి(43) సోమవారం ఉదయం ట్రాక్టర్తీసుకుని తన పొలం వద్దకు వెళ్లాడు.
పొలం దున్నుతూ.. గట్టు ఎక్కించే ప్రయత్నంలో ట్రాక్టర్బోల్తా పడగా, దాని కింద తిరుపతి పడిపోయాడు. దీంతో అతని తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి రైతులు కరీంనగర్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి భార్య అంజలి ఫిర్యాదు తో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్తెలిపారు.