
- ములుగు మండలంలో ఘటన
ములుగు, వెలుగు : ములుగులో శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి నామినేషన్ కు హాజరై ఇంటికి వెళ్తున్న ఓ రైతు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కుటుంబసభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం..ములుగు మండలం కొత్తూరుకు చెందిన దయ్యాల మనోహర్ (55) శుక్రవారం ములుగులో బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతి నామినేషన్ ప్రోగ్రామ్‌కు బైక్‌పై వచ్చాడు. సాయంత్రం జంగాలపల్లి మీదుగా కొత్తూరుకు వెళ్తుండగా రాంనగర్ సమీపంలో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
తలకు తీవ్ర గాయం కావడంతో చనిపోయాడు. మనోహర్‌కు భార్య రాజమ్మ, ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. బిడ్డలకు పెండ్లి కాగా, ఓ కొడుకు మూడేండ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో మరణించాడు. ఎకరం పొలం ఉండగా మరో ఎకరం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకునే మనోహర్.. ఖాళీ సమయాల్లో కూలీ పనులకు వెళ్లేవాడు.