
కోహెడ మండలం నాగసముద్రాలకు చెందిన అప్పిస చిరంజీవి మొక్కజొన్న పంటను కోతులు పాడుచేస్తున్నాయి. చేను వద్ద ఒకవైపు కాపలా ఉంటే మరో వైపు చొరబడి కంకులు తెంపి పడేస్తున్నాయి. వాటి నుంచి పంటను కాపాడేందుకు కొండెంగ బొమ్మ ఉన్న ఫ్లెక్సీలను చేను చుట్టూ ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి కోతుల రాక తగ్గిందని తెలిపాడు.- కోహెడ, వెలుగు