కామారెడ్డి జిల్లాలో కోళ్లకు చల్లదనం కోసం స్ప్రింక్లర్ల ఏర్పాటు

కామారెడ్డి జిల్లాలో కోళ్లకు చల్లదనం కోసం స్ప్రింక్లర్ల ఏర్పాటు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కోళ్లను కాపాడుకునేందుకు జిల్లాకు చెందిన ఓ రైతు కోళ్ల ఫారం షెడ్డుపై స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. గాంధారి మండలం గుర్జాల్​తండాకు చెందిన సరిచంద్‌‌‌‌కు 10 వేల కోళ్ల కెఫాసిటీకి ఉన్న రెండు ఫారాలు ఉన్నాయి.

 ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా రెండు షెడ్లపై స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు.  స్ప్రింక్లర్ల షెడ్లపై నిరంతరం నీళ్లు పడుతుంటే ఆ నీటి చుక్కలు వర్షం లెక్క కిందకు జారుతున్నాయి. ఆ నీటిని కాల్వ ద్వారా వరి పంటకు తడి అందిస్తున్నారు.  దీంతో కోళ్ల షెడ్లు చల్లగా ఉంటున్నాయని రైతు పేర్కొన్నారు.