
బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో దేశవ్యాప్తంగా ఇవాళ బంద్ జరుగుతోంది. రైతు సంఘాలతో పాటు పలు కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఈ భారత్ బంద్‌కు మద్దతు తెలిపాయి. దేశంలోని పలు సిటీల్లో ఆయా సంఘాల నిరసనల కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది. పలు ప్రాంతాల్లో రైళ్లు నిలిపేయాల్సి వచ్చింది.
ఈ క్రమంలో భారత్ బంద్‌లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా రోడ్లపై తిరుగుతూ డ్యూటీ చేస్తుండగా బెంగళూరులో నార్త్ జోన్ డీసీపీ ధర్మేంద్ర మీనా పైకి ఓ రైతు నేత కారు దూసుకొచ్చింది. అయితే ఆయన వేగంగా పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. కాలు చివరి భాగాన్ని తొక్కుతూ కారు ముందుకెళ్లింది. ఆయన క్షేమంగానే ఉన్నారని, కాలికి చిన్న గాయమే అయ్యిందని పోలీసులు తెలిపారు.