అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

బచ్చన్నపేట, వెలుగు: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసున్నాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపూర్ ​గ్రామానికి చెందిన పరిదే సాయి మల్లయ్య(42) తనకున్న 4 ఎకరాల పొలంలో వరి వేశాడు. నీరులేక పొలం ఎండిపోయింది. దాంతో రూ.4 లక్షలు అప్పు చేసి బోర్లు వేశాడు. ఆ బోర్ల నీళ్లు సరిపోక  పంట ఎండిపోయింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై సోమవారం తన పొలంలోని చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు.