పంట నష్టపరిహారం రాలేదని రైతు వేదికలో ఏవో నిర్బంధం

  • ఆఫీసర్ ​నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆగ్రహం
  • వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో ఘటన

పర్వతగిరి (సంగెం), వెలుగు : వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయిలో మంగళవారం పంట నష్ట పరిహారం అందలేదని రైతులు అగ్రికల్చర్ ఏవోను రైతు వేదికలో నిర్బంధించి తాళాలు వేశారు. పంట నష్టం నమోదు విషయంలో ఏవో నిర్లక్ష్యం వహించడం వల్లే తమకు నష్టపరిహారం అందలేదని రైతులు ఆరోపించారు.

 అకాల వర్షంతో వందలాది ఎకరాల్లో పంటలు నష్టపోయినా తమకు ప్రభుత్వ సహాయం అందకుండా చేసి తప్పు తమపై మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, అధికారులు స్పందించి తమకు ప్రభుత్వ సహాయం అందేలా చూడాలని డిమాండ్​చేశారు. చివరకు పోలీసులు వచ్చి రైతులకు నచ్చజెప్పడంతో తాళం తీశారు.