- మేడ్చల్ - మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్
- గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణం
మేడ్చల్, వెలుగు: మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా బొంగునూరి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్‌విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్తోటకూర వజ్రేశ్‌యాదవ్ పాల్గొన్నారు. నర్సింహులు యాదవ్, శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నర్సింహులు యాదవ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి తనపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, వజ్రేశ్‌యాదవ్, ఇతర నాయకులకు రుణపడి ఉంటానని చెప్పారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తానన్నారు.