- ఫెర్టిలైజర్ షాపు ముందు బాధిత రైతు ధర్నా
- పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
నల్లబెల్లి, వెలుగు: నకిలీ పురుగు మందులు ఇచ్చిన ఫెర్టిలైజర్ షాపు ముందు ఓ రైతు ఆందోళనకు దిగాడు. బాధిత రైతుకు మద్దతుగా పలువురు రైతులు వచ్చి షాపు ఓనర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు తెలిపిన వివరాల మేరకు.. వరంగల్జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మిపురం గ్రామానికి చెందిన ముగ్ద రైతు యుగేందర్తన రెండెకరాల భూమిలో మిరప పంట సాగు చేశాడు. నల్లబెల్లిలోని ఖాజా మొయినోద్దీన్ ఫెర్టిలైజర్ షాపులో రూ.6 వేల పెట్టి పురుగు మందు కొనుగోలు చేశాడు. షాపు ఓనర్ సింగో, ఆజా కంపెలకు చెందిన పురుగు మందులను ఇచ్చాడు.
అవి తీసుకెళ్లి యుగందర్ పంటకు కొట్టిన రెండు రోజుల్లోనే ఎరుపు రంగులోకి మారి మిరప చేను పాడైంది. సోమవారం ఫెర్టిలైజర్ షాపు ముందు యుగందర్ ధర్నా చేశాడు. నకిలీ పురుగు మందు కొట్టడడంతోనే పంట దెబ్బతిందని వ్యవసాయ అధికారు లు తెలిపినట్టు రైతు యుగందర్ వాపోయాడు. బాధిత రైతుకు మద్దతుగా పలువురు రైతులు ఆందోళన చేశారు. నకిలీ పురుగు మందులు అమ్మిన షాపు ఓనర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతుకు పరిహారం చెల్లించాలని కోరారు. నల్లబెల్లి ఎస్ఐ ప్రశాంత్బాబు వెళ్లి షాపు ఓనర్ తో మాట్లాడి నష్టపరిహారం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.