తెలంగాణతో పాటుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ , మిజోరాం రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం 2023 అక్టోబర్ 9 న ఎలక్షన్ షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. దీంతో ఆయా రాష్ట్రాలోని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశాయి. ఈ క్రమంలో రాజస్థాన్ లోని బీజేపీ .. అధికార కాంగ్రెస్ ను విమర్శిస్తూ ఏర్పాటు చేసిన ఓ ప్లె్క్సీ వివాదంగా మారింది.
రాజస్థాన్‌లో 19 వేల మందికి పైగా రైతులు తమ బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో వారి భూమిని ప్రభుత్వం వేలం వేసినట్లు పేర్కొంటూ రైతు ఫోటోను చూపుతున్న ఓ పోస్టర్‌ను రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫొటోలోఉన్న రైతు.. జైసల్మేర్ ప్రాంతానికి చెందిన మధురం జైపాల్ ప్రభుత్వ తన భూమిని వేలం వేయలేదని, బీజేపీ తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు . దీనికి గానూ అతను రాష్ట్ర బీజేపీపై పరువునష్టం దావా వేశారు. బీజేపీ బ్యానర్‌పై ఉన్న ఫోటోను చూసి తమ గ్రామ ప్రజలు, బంధువులు తనను గుర్తించి విషయం ఎంటని అడిగారని తెలిపాడు. వీలైనంత త్వరగా తన ఫోటోలు తీసేయాలని, లేనిపక్షంలో పార్టీపై చర్యలు తీసుకుంటానని ఆ రైతు హెచ్చరించాడు.
మరోవైపు ఆ రైతును రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కలిశారు. " మా రైతు పరువు ఎందుకు తీశావు? రాజస్థాన్ మొత్తం బీజేపీని అడుగుతోంది" అని గెహ్లాట్ ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాలను చూపిస్తుంది.