ఆన్లైన్ ఫ్రాడ్: ఆవులు అమ్ముతామని..రూ.30 వేలు కొట్టేశారు

ఆన్లైన్ ఫ్రాడ్.. సైబర్ నేరాల గురించి వార్త లేని రోజు లేదు. ప్రతిరోజు ఆన్లైన్ మోసాలకు గురించి కుప్పులు కుప్పలుగా వార్తలు వస్తున్నాయి. టెక్నాలజీ అభివృద్ది అవుతున్న కొద్దీ ఆన్లైన్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఫోన్కాల్స్, మేసేజ్లు, ఫోన్ హ్యాకింగ్, అధికారులమని చెప్పి ఫోన్ చేసిన బెదిరింపు మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు..దీంతోపాటు డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ షాపింగ్ పెరిగాక ఈ ఆన్లైన్ మోసాలు మరింత పెరిగాయి. తాజాగా సైబర్ నేరగాళ్లు..ఆన్లైన్లో ఆవులు అమ్ముతామని చెప్పి తప్పుదోవ పట్టించి ఓ రైతు నుంచి రూ. 30 వేలు కాజేశారు. వివరాలేంటో తెలుసుకుందాం.

గురుగ్రామ్ కు చెందిన రైతు సుఖ్ బీర్ ఆవులను కొనుగోలు చేసేందుకు ఆన్ లైన్ ను ఆశ్రయించాడు. యూట్యూబ్ లో  ఓ యాడ్ ను చూసి.. ఆవులు కొనుగోలు చేయాలనుకున్నారు. అందులో ఇచ్చిన ఫోన్ నెంబర్ ను కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. అవతలి వ్యక్తి .. తన దగ్గర నాలుగు ఆవులు ఉన్నాయి.. ఒక్కోటి 35 వేల రూపాయలు.. నాలుగు ఆవులు కోనుగోలు చేస్తే.. మొత్తంగా రూ. 95 వేలకే ఇస్తానని ఫోటోలు షేర్ చేశారు. మోసగాళ్ల మాటలు నమ్మిన ఆ రైతు.. ఆన్ లైన్ లోనే ఆవులను చూసుకుని అడ్వాన్స్ చెల్లించేందుకు సిద్దమయ్యాడు. 

మొదటి ఫ్రాడ్ స్టర్లు 22ల రూపాయలు అడ్వాన్స్ చెల్లించాలని చెప్పారు. అయితే ట్రాన్స్ పోర్టు ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయని మరికొంత మరో 8 వేలు చెల్లించాలని డిమాండ చేశారు. దీంతో సుఖ్విందర్ డబ్బును చెల్లించాడు. అయినా రకరకాలు కారణాలతో మరింత డబ్బు చెల్లించాలని సుఖ్విందర్ ను మోసగాళ్లు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి.. తన కొడుకుకి విషయం చెప్పాడు. దీంతో మోసపోయినట్లు గుర్తించి పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేశారు. 

ఆన్ లైన్ మోసానికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రైతు నగదు బదిలీ చేసిన బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేయించారు. సంబంధిత అకౌంట్ ఉన్న బ్యాంక్ కు నోటీసు లు జారీ చేశారు. డిటెయిల్స్ పొందిన తర్వాత విచారణ చేపట్టారు పోలీసులు.. విచారణ కొనసాగుతోంది.