బెల్లంపల్లి రూరల్, వెలుగు: తునికాకు బోనస్డబ్బులు ఇవ్వాలంటూ కేతన్ పల్లి, కల్మలపేటకు చెందిన కూలీలు ధర్నాకు దిగారు. కష్టపడి కోసిన తునికాకు ఐదేండ్ల బోనస్ రావడం లేదని నీల్వాయి అటవీ రేంజ్కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. ఈ విషయంపై ఎఫ్ఎస్ఓ రాములును ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీలు ధర్నాకు వస్తున్న విషయం తెలుసుకున్న సిబ్బంది కార్యాలయం నుంచి వెళ్లిపోగా.. దాదాపు 3 గంటల పాటు కార్యాలయం ముందు కూలీలు ధర్నా చేశారు.
ALSO READ:రూ.100 కోట్లతో 500 ఆలయాలు నిర్మించాం: ఇంద్రకరణ్ రెడ్డి
అయినా సిబ్బంది ఎవరు అక్కడికి రాలేదు. 2016 –21 సంవత్సరాలకు చెందిన బోనస్ గతేడాదే మంజూరు చేసినప్పటికీ కొంత మంది ఖాతాల్లో డబ్బులు పడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి బోనస్డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు.