రైతులపై రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ : ఢిల్లీ సరిహద్దుల్లో యుద్ధం

రైతులపై రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ : ఢిల్లీ సరిహద్దుల్లో యుద్ధం

ఢిల్లిలో పాదయాత్ర చేస్తున్న రైతులు ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుకడుగు వేయడం లేదు. హర్యాన, పంజాబ్ రాష్ట్రాల నుంచి 10వేల మంది రైతులు ఛలో ఢిల్లీ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. పంజాబ్ నుంచి రైతులు ట్రాక్టర్ ట్రాలీలు, వాటర్ ట్యాంకర్లు, బుల్డొజర్లపై హర్యానవైపు చొచ్చుకువస్తున్నారు. పాటియాల జిల్లా ఖనౌరీ దగ్గర మంళవారం పోలీసులు ట్రాక్టర్ల టైర్లను పేల్చివేశారు. దీంతో రెచ్చిపోయిన నిరసన కారులు బారికేట్లను ద్వంసం చేశారు. శంభులో  కాంక్రీట్ తొలగించి  బారికేట్ల  ఘగ్గర్ నదిలోకి విసిరారు.

ఖనౌరీలో పోలీసులు రైతులపై ఏడు గంటల పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. 60 మంది రైతులకు రబ్బరు బుల్లెట్లు తగితాయి. గాయపడిన రైతులను పాటియాల ప్రభుత్వ హాస్పిటల్ కు పంపిస్తున్నారు. శుంభు, డేటా సింఘ్ వాలా బార్డర్ దగ్గర ఇద్దరు జర్నలిస్టులతోపాటు 24మంది పోలీసు సిబ్బంది అల్లర్లలో గాయపడ్డారు.  పోలీసుల పట్టుదిట్టమైన చర్యలతో రైతులు ఖనౌరీని దాటి ముందుకు వెళ్లలేకపోయారు. మంగళవారం సాయంత్రాని ఛలో ఢిల్లీ పాదయాత్రను ఆపి బుధవారం ఉదయాన్నే మళ్లీ ముందుకు వెళ్తామని రైతు సంఘాల నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ అన్నారు. రైతులపై  కేంద్ర ప్రభుత్వ ఈ తరహా తీరు సిగ్గు చేటని మండిపడ్డారు.

ఇంటర్ నెట్ ఆంక్షలు పొడిగింపు
హర్యాన, అంబాలా, కురుక్షత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లా్ల్లో ఇంటర్ నెట్ జిల్లాల్లో గురువారం అర్థరాత్రి వరకు ఇంటర్ నెట్ సర్వీసులు బంద్ ను పొడిగించారు. ఆయ ప్రాంతాల్లో నార్మల్ మెసేజ్ లు తప్పా మరి యే ఇతర వాయిస్ కాల్స్, ఇంటర్ నెట్ పని చేయవు.