వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎస్బీఐ బ్యాంకు ముందు రైతుల ఆందోళనకు దిగారు. రైతు రుణమాఫీ, కొత్త రుణాల మంజూరులో బ్యాంకర్లు అలసత్వం వహిస్తున్నారని రోడ్డుపై బైఠాయించారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు
రైతుల ఆందోళనతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.దాదాపు గంటకు పైగా వాహనాలు నిలిచిపోవడంతో కిలో మీటర్ల మేర ట్రాపిక్ జామ్ అయ్యింది.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.