బెజ్జంకి, వెలుగు : రుణమాఫీ అయ్యేంతవరకు బ్యాంకు లావాదేవీలు జరగనీయమని గురువారం మండలంలోని తోటపల్లి ఇండియన్ బ్యాంకు ముందు రైతులు ఆందోళన చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు బ్యాంకు వద్దకు చేరుకొని సిబ్బందిని బయటకు పంపించి షట్టర్ వేశారు.
విషయం తెలుసుకున్న ఎస్ఐ కృష్ణారెడ్డి పోలీసులతో అక్కడికి వచ్చి టెక్నికల్లోపం వల్ల జరిగిన తప్పిదమని అందరికీ రుణమాఫీ జరుగుతుందని వారికి నచ్చజెప్పారు.