ఖమ్మం జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. దమ్మాయిగూడెంలో ధాన్యం కొనుగోలు చేయటం లేదని రోడ్లపై నిరసన చేపట్టారు. ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అకాల వర్షాలతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. అటు సూర్యాపేట-జనగాం రహదారిపైనా బాలెంల ఐకేపీ సెంటర్ వద్ద రైతులు ధర్నా చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గత వారం పది రోజులుగా వడ్లు కొనుగోలు జరపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు వడ్లు తడిచి మొలకెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు పట్టించుకుంటలేరు..
ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆర్డీవో, ఎంఆర్ఓ ఇతర అధికారులు వచ్చి ధాన్యాన్ని చూసి వెళ్తున్నారే తప్ప.. కొనుగోళ్లు జరిపేలా చర్యలు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కర్షకులు కోరుతున్నారు.