జైపూర్ మండలంలో రైతుల ఖాతాల్లో రూ.11 లక్షలు జమ

జైపూర్ మండలంలో రైతుల ఖాతాల్లో రూ.11 లక్షలు జమ

జైపూర్, వెలుగు:  మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు  వేలాల, గోపాల పూర్, పౌనూర్ గ్రామాలకు చెందిన పంట చేన్లు, పొలాలు నీట మునిగాయి.  ఆయా గ్రామాలకు చెందిన రైతులు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.  వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అగ్రికల్చర్ ఆఫీసర్లను నీట మునిగిన పంటల వివరాలు సేకరించాలని ఆదేశించారు.  నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు అందజేశారు.

  వారం రోజుల క్రితం రైతుల ఖాతాల్లో ఒక ఎకరానికి రూ.10 వేల నష్ట పరిహారం చొప్పున110 ఎకరాలకు రూ.11 లక్షలు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయినట్లు తెలిపారు.  కాంగ్రెస్ ప్రభుత్వం మాట ప్రకారం.. రైతులకు నష్టపరిహారం అందజేసిందని హర్షం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ నాయకులు డేగ నగేశ్ ఆధ్వర్యంలో  సీఎం రేవంత్ రెడ్డి,  చెన్నూర్ ఎమ్మెల్యే, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ  ఫొటోలకు రైతులు క్షీరాభిషేకం చేశారు.