తగ్గిన దిగుబడి.. దక్కని మద్దతు 

జనగామ, వెలుగు: ఓ వైపు తగ్గిన దిగుబడి, మరో వైపు దక్కని మద్దతు ధర రైతులకు యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నష్టాలనే మిగులుస్తున్నాయి. జనగామ జిల్లాలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నా.. వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మాత్రం ఇంకా స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకోలేదు. ఆఫీసర్లు రివ్యూలు నిర్వహించడంలో చూపుతున్న వేగం సెంటర్లను ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంలో చూపడం లేదు. దీంతో రైతులు  ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యక్తులను వ్యక్తులను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది. మరో వైపు మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సైతం రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. జనగామ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రతి రోజు 4 వేల నుంచి 5 వేల బస్తాల వడ్లు వస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే జనగామ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 3,243 బస్తాల వడ్లు వచ్చాయి. మద్దతు ధర రూ. 2,060 ఉండగా రైతులకు గరిష్టంగా రూ. 1,625, కనిష్టంగా రూ. 1,503 మాత్రమే దక్కింది. 

భారీగా తగ్గిన దిగుబడి

యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైభారీగా ఆశలు పెట్టుకున్న రైతులు మొత్తం 1.89 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దీంతో ఈ సారి 2.30 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ దేవాదుల నీళ్లు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైంలో విడుదల చేయకపోవడం, భూగర్భ జలాలు సైతం అడుగంటడంతో పంట దెబ్బతింది. ముందస్తుగా నాట్లు వేసిన పంటలకు తెగుళ్లు సోకాయి. పంట పొట్ట దశలో ఉన్నప్పుడు మెడ విరుపు తెగులు సోకడంతో గొలుసులు పాలు పట్టకుండా ఊస తిరిగిపోయాయి. దీంతో దిగుబడిపై భారీగా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడింది. ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 20 క్వింటాళ్లు కూడా సరిగా రాలేదని రైతులు అంటున్నారు. ఎకరానికి రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు పెట్టుబడి పెట్టామని, దిగుబడి తగ్గడం, మద్దతు ధర దక్కకపోవడంతో నష్టాలు తప్పేలా లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

స్లోగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

జనగామ జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లో ఆలస్యం జరుగుతోంది. కోతలు ముమ్మరంగా జరుగుతుంటే.. ఆఫీసర్లు ఇంకా కేంద్రాల ఏర్పాటు సన్నాహాలపైనే ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెడుతున్నారు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జిల్లా వ్యాప్తంగా ఐకేపీ ఆధ్వర్యంలో 111, పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఆధ్వర్యంలో 89 కలిపి మొత్తం 200 సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సెంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. అయినా జిల్లాలో ఇప్పటివరకు సెంటర్ల ఏర్పాట్లు స్పీడందుకోలేదు. 

సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలే... 

యాసంగిలో మూడెకరాల్లో  వరి వేసిన. ఎకరానికి రూ. 25 వేల వరకు పెట్టుబడి అయింది. మా ఊరిలో సర్కారు సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలే. వరి కోసి జనగామ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తెచ్చిన. క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.1,526 ధర వేసిన్రు. సుమారు 100 బస్తాల ధాన్యం అమ్మిన. మా ఊరిలో కొనుగోళ్లు స్టార్ట్​ అయితే అక్కడే అమ్మేవాడిని. సెంటర్​ ఏర్పాటు కాకపోవడంతో మద్దతు ధర దక్కలేదు.
-
 శివరాత్రి వెంకటేశ్వర్లు, 
ఫతేషాపూర్​, రఘునాథపల్లి మండలం