టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భూములియ్యం : రైతులు

జనగామ, వెలుగు   : జనగామ జిల్లా కొడకండ్లలో నిర్మించే టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భూములు ఇచ్చేది లేదంటూ రైతులు స్పష్టం చేస్తున్నారు. అందుబాటులో ప్రభుత్వ  భూమి ఉన్నా వాటిని కాదని సాగు భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. 60 ఏళ్లుగా సాగు చేసుకుంటూ బతుకుతున్న తమ భూములను ఇచ్చేది లేదంటూ సోమవారం జనగామ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట ధర్నా నిర్వహించారు. 

జనగామ జిల్లా కొడకండ్లలో టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 


పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పట్టణ శివారులో 20 ఎకరాలు సేకరించేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. అయితే ఆ భూములను తమకు 1959లో అసైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైతం ఇచ్చారని పలువురు రైతులు చెబుతున్నారు. ఆ భూములను సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇప్పుడు టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో భూములను తీసుకుంటే  ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ శివారులోని 853 సర్వే  నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 50 ఎకరాలు, మరో సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అక్కడ టెక్సైటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఏర్పాటు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. సోమ వారం సుమారు 50 మంది రైతులు  జనగామ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. అనంతరం తమకు న్యాయం చేయాలంటూ  కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. 

60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నం

60 ఏండ్ల కింద అప్పటి సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాకు ఎకరం భూమి ఇచ్చింది. కేసీఆర్ గెలిచినంక పట్టా బుక్కులు కూడా ఇచ్చిన్రు. అప్పటి నుంచి పత్తి సాగు చేసు కుంటూ బతుకున్నం. ఇప్పుడు ఆఫీసర్లు భూములు తీసుకుంటే మేము బతికేదెట్లా ? మాకు అన్యాయం చేయొద్దు.
- మద్దెబోయిన బుచ్చమ్మ, రైతు

సర్కారు భూమి ఉన్నా.. 

కొడకండ్ల శివారులో 100 ఎకరాలు, మరో చోట 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమిలో టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్కు ఏర్పాటు చేయాలి. ఎన్నో ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను గుంజుకోవద్దు. నాకు ఉన్నదే 9 గుంటల భూమి. దానిని కూడా తీసుకుంటే నేనెట్లా బతకాతె.
-  కాగితం పెద్ద ఉప్పలయ్య, రైతు