మళ్లీ ధాన్యం కోతలు..అన్నదాతను వెంటాడుతున్న అకాల వర్షాలు

  •     కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు
  •     సౌకర్యాలు లేక అవస్థలు

నిర్మల్, వెలుగు : రైతులను ధాన్యం  కోతలు  వెంటాడుతున్నా యి. నిర్మల్ జిల్లాలోని మొత్తం 199 కొనుగోలు కేంద్రాల్లో  రైతులు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు.   కానీ, నిర్వాహకులు  రైతుల  నుంచి ప్రతి క్వింటాకు దాదాపు 5 కిలోల దాకా తరుగు పెడుతున్నారనే  ఆరోపణలు వస్తున్నాయి.  ఏటా ధాన్యం కొనుగోలులో కోతల ఉంటున్నాయని రైతులు చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల ద్వారా   లక్షా 36 వేల 288 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇప్పటివరకు  63 వేల 96 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.  ఈ ధాన్యం  నుంచి 61 వేల 200 మెట్రిక్ టన్నులు  తరలించగా  1800 మెట్రిక్ టన్నులు  ఇంకా కేంద్రాల్లోనే ఉంది.  రెండు రోజుల  నుంచి  వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో  రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.   కేంద్రాలల్లో  టార్పాలిన్లను  పంపిణీ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  

అధికారులు మాత్రం ఎన్నికల  కారణంగా ధాన్యం కొనుగోళ్లపై సరైన దృష్టి సారించలేదన్న విమర్శలున్నాయి. దీంతో  కేంద్రాల నిర్వహకులు ఆడిందే ఆటగా తయారైంది.  అడ్డగోలు కోతలు విధిస్తూ రైతులను నట్టేట ముంచారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. 

అన్నీ సమస్యలే.. 

కొనుగోలు కేంద్రాల్లో  రైతులకు కనీస సౌకర్యాలు  లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చెల్లింపుల విషయంలో కూడా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం లేదని రైతులు అంటున్నారు.  ఇప్పటివరకు 12 వేల 700 మంది రైతులు 63 వేల 96 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు. వీరందరికీ రూ. 94 కోట్ల 99 లక్షల  చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు కే వలం 6 వేల మంది రైతులకు మాత్రమే రూ. 68 కోట్లు చెల్లించారు. అలాగే తరుగు పేరిట కూడా రైతులను కేంద్రాల నిర్వ హకులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

తరుగు విషయంలో ప్రశ్నించే రైతులపై కక్ష సాధింపు చర్యలు కూడా తీసు కుంటున్నారని చెబుతున్నారు. నాణ్యత పేరిట ధాన్యం కొనుగో లుకు కొర్రీలు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.  సంబంధిత అధికారులు ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలలో రైతులకు సౌక ర్యాలు కల్పించడంతోపాటు,  కోతల విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కోతలు విధిస్తున్నారు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కోతలు విధిస్తున్నారు. ప్రతి క్వింటాల్​కు మూడు నుండి ఐదు కిలోల వరకు కోతల పేరిట తీసుకుంటు న్నారు. గతంలో కూడా ఇలాగే చేశారు. వాతావరణం లో మార్పు రావడం తో భయపడుతున్నాం. టార్పాలిన్లు కూడా తమకు పంపిణీ చేయలేదు. 

 పెద్దోళ్ల మహేశ్​, రైతు,జామ్ గ్రామం

రైతులకు టార్పాలిన్లు సప్లై చేస్తాం..

కొనుగోలు కేంద్రాల్లో  రైతులకు   టార్పా లిన్ల  సప్లయ్​ చేయాలని  స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. కొనుగోలు కేంద్రాల నుంచి  ధాన్యాన్ని  వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.  కేంద్రాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.  రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

ఆశిష్ సాంగ్వాన్, కలెక్టర్,  నిర్మల్ జిల్లా.