బోధన్,వెలుగు: సాలూర మండలంలోని హున్సా, మంధర్నా, ఖజాపూర్ గ్రామాల రైతులు సోయాబీన్ పంట కొనుగోలు చేయాలని సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్రాజీవ్గాంధీ హనుమంతుకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ నాఫేడ్ సంస్థ సహకారంతో హున్సా సొసైటీ ద్వారా సొయాబీన్ పంటను రైతుల నుంచి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన సోయాను లారీల్లో సారంగపూర్‌లోని గోదాంలకు పంపించగా ఏడు లారీల సోయాబీన్ బాగాలేదని తిరస్కరించినట్లు చెప్పారు.
అంతేకాకుండా రవాణా ఖర్చు భారం రైతులపై వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరస్కరించిన సోయాపంటను తిరిగి కొనుగోలు చేయాలని కోరారు. కలెక్టర్‌ను కలిసినవారిలో హున్సా సొసైటీ చైర్మన్ రవి, సొసైటీ వైస్ ప్రెసిడెంట్వినోద్ బాబా, సొసైటీ డైరెక్టర్లు ఖజాపూర్ అశోక్, చింతం మైసయ్య, మూర్గె శంకర్, హున్సా, మందర్నా, ఖజాపూర్ గ్రామాల రైతులు ఉన్నారు.