ఆఫీసర్ల తప్పులు.. రైతులకు తిప్పలు

  • పట్టా భూములను బంచరాయిగా రాసిన తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసమంటూ భూములు తీసుకున్న ప్రభుత్వం
  • పరిహారం కోసం నాలుగేళ్లుగా తిరుగుతున్న రైతులు

జనగామ, వెలుగు : ఆఫీసర్లు చేసిన తప్పు రైతులను నాలుగేళ్లుగా తిప్పలు పెడుతోంది. పట్టా భూములను బంచరాయి భూములుగా రికార్డుల్లో నమోదు చేసి రియర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసమంటూ స్వాధీనం చేసుకున్నారు. కానీ పరిహారం మాత్రం చెల్లించలేదు. దీంతో అటు భూమిలేక, ఇటు పరిహారం రాక రైతులు పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టుకొని ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో సోమవారం నేరుగా జనగామ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చి అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిశారు. 

పట్టా భూములు బంచరాయిగా...

జనగామ జిల్లా పాలకుర్తి రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణం కోసం బమ్మెర గ్రామంలోని 280, 629, 311, 515/2, 608 సర్వే నంబర్లలో 103.16 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు నిర్ధారించారు. 2019‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్పటి కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణారెడ్డి హయాంలో భూములను సేకరించారు. ఇందులో 280, 629, 311 సర్వే నంబర్లలోని 4.10 ఎకరాలను ప్రభుత్వ పోరంబోకు భూమిగా, 515/2లోని 7.37 ఎకరాలను బంచరాయి భూములుగా గుర్తించారు. ఇక 608 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న 91.9 ఎకరాలను మొత్తం బంచరాయి భూములుగా గుర్తించి అప్పటి తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూ సేకరణ స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిప్యూటీ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రిపోర్టు ఇచ్చారు. అయితే 608 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుమారు 40 ఎకరాలు పట్టా భూములు ఉన్నాయని, వీటిని కూడా బంచరాయి భూములుగా నమోదు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న రైతులు

సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 608లో సుమారు 40 మంది రైతులకు పట్టా భూములు ఉన్నాయి. తమది బంచరాయి భూమి కాదని, తెలంగాణ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చాక ఇచ్చిన పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైతం ఉన్నాయని రైతులు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. భూమి తమ తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిందని రైతులు చెబుతున్నారు. రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం పట్టుబట్టి తీసుకున్న ఆఫీసర్లు పరిహారం మాత్రం ఇవ్వడం లేదని వాపోతున్నారు. \

ALSO READ:ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ ఒకటి: మోదీ

ఇదే రిజర్వాయర్​కింద భూములు కోల్పోయిన కొందరు రైతులకు ఎకరాకు రూ. 7.80 లక్షలు ఇచ్చారని, అదే పరిహారం తమకూ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఆ సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని భూమి మొత్తం బంచరాయిగా రికార్డుల్లో నమోదు కావడంతో పరిహారం ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన తప్పుకు తాము బలి అవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లు ఎవరూ పట్టించుకోకపోవడంతో సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చి అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిశారు. ఇప్పటికైనా స్పందించి తమకు పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.

నాలుగేండ్లయింది 

బమ్మెరలో నాకున్న ఎకరం భూమి రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద పోయింది. 2019లో పట్టుబట్టి తీసుకొని, ఎకరానికి రూ.8 లక్షలు ఇస్తామని చెప్పిన్రు. కొందరికి డబ్బులు రావడంతో మా సంగతేంటని ఆరా తీసినం. మా భూములు బంచరాయి కింద నమోదైనట్లు తెలిసింది. అప్పటి నుంచి ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నం.
- వంగాల శోభన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబా, బాధిత రైతు, బమ్మెర

పరిహారం ఇయ్యాలే 

నా భర్త ఎల్లయ్య పేరు మీదున్న 30 గుంటల భూమి రియర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోయింది. ఇప్పటివరకు రూపాయి కూడా రాలేదు. ఎవరిని అడిగినా పట్టించుకుంటలేరు. పైసల కోసం ఇంకా ఎన్ని సార్లు తిరగాలె. ఆఫీసర్లు స్పందించి పైసలు ఇప్పించాలె.
- అనపర్తి వెంకటమ్మ, బాధిత రైతు, బమ్మెర