వర్షాలతో అల్లాడుతుంటే బర్త్ డే సంబురాలా: తుల ఉమ

జగిత్యాల టౌన్,వెలుగు: వర్షాలతో ప్రజలు అల్లాడుతుంటే మంత్రి కేటీఆర్ బర్త్ డే సంబురాలు చేసుకోవడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తుల ఉమ విమర్శించారు. జిల్లాలోని భీమారంలో ముంపునకు గురైన ఏనుగుకుంట, చెరువుల  మరమ్మతులకు తక్షణ చర్యలు చేపట్టాలని మంగళవారం  కలెక్టర్ షేక్ యాష్మీన్ బాషాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా  వరదలు వచ్చి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

ALSO READ :ద్వేషంలో నాన్న : నా కూతురు అంజూ అలియాస్ ఫాతిమా చ‌చ్చిపోయింది

చెరువుల పరిస్థితిని అంచనా వేయడానికి  ఇంజినీర్ల బృందాన్ని నియమించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో  పార్టీ పట్టణ అధ్యక్షుడు అనిల్, రాజా గౌడ్, ఉమేశ్ తదితరులు పాల్గొన్నారు.