
- సరిపడా బస్తాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్
- కరీంనగర్జిల్లాలో ఘటన
హైదరాబాద్: కరీంనగర్జిల్లా ఇందుర్తిలో యూరియా కోసం రైతులు చెప్పులతో క్యూ కట్టి ఎదురుచూస్తున్నారు. యూరియా బస్తాల కోసం క్యూలైన్లలో ఉన్న రైతులు గొడవలు పడుతున్నారు. 400 మంది రైతులకు 200 మాత్రమై యూరియా బస్తాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు చాలాసార్లు సమస్యను చెప్పిన పట్టించుకోవడం లేదన్నారు. రైతుల అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. లేనియెడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.