- మూడున్నర గంటలు రైతుల ఆందోళన
వరంగల్ సిటీ: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో కాంటాలు నిలిచిపోయాయి. పత్తి ధరలు రోజురోజుకు తగ్గిస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటలకు ఒక ప్రారంభం కావాల్సిన ధరలు, కాంటాలు 11:30 గంటలు దాటింది.
ఈ నేపథ్యంలో ఏనుమాముల సీఐ మార్కెట్ కు చేరుకొని అధికారి నిర్మలతో చర్చలు జరిపారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో పాటు రైతు సంఘ నాయకులతో చర్చలు జరిపి పరిస్థితిని చక్కదిద్దారు.
ALSO READ | జీఓ 29ను రద్దు చేయాలి : మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
సుమారు మూడున్నర గంటల తర్వాత జెండా పాటను ప్రారంభించారు. కాగా, పత్తి ధర రూ. 7000 పలికింది. నిన్నటి కంటే క్వింటాల్ పత్తి ధర కంటే ఇవాళ మరో రూ.50 తగ్గింది.