కాగజ్ నగర్, వెలుగు : తమ భూముల్లో సాగు చేసుకోకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట మండలంలోని ఆరేగూడ, మోసం గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. తమ తాతల కాలం నాటి ఈ భూముల్లో సాగు చేసుకుంటున్నామని తెలిపారు.
ఆరేగూడ గ్రామ శివారు సర్వే నంబర్ 72లోని సుమారు మూడు వేల ఎకరాల్లో దాదాపు 600 మంది రైతులు సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. గతవారం రోజులుగా ఈ భూముల్లో దుక్కులు దున్నేందుకు వెళితే ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని వాపోయారు.
ఆందోళన చేస్తున్న రైతుల దగ్గరకు తహసీల్దార్ కిరణ్ కుమార్ చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు.