రోడ్డుపై పెట్రోల్ పోసుకొని రైతులు ఆత్మహత్యా యత్నం

రోడ్డుపై పెట్రోల్ పోసుకొని రైతులు ఆత్మహత్యా యత్నం

శివ్వంపేట, వెలుగు: మండలంలోని అల్లిపూర్ తండా వద్ద అటవీ భూమిని ఆక్రమించారని ఫారెస్ట్ ఆఫీసర్లు ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకుని తీసుకెళ్తుండగా  రైతులు అడ్డుకోవడంతో పాటు, ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. తండాకు చెందిన గిరిజన రైతులు రూప్ సింగ్, విజయ్ 12 ఏళ్లుగా భూమి సాగు చేసుకుంటున్నరు. గురువారం తూప్రాన్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి అది ఫారెస్ట్ భూమి అని అక్కడ సాగు చేయడానికి వీలులేదన్నారు. ఫారెస్ట్ భూమి దున్నిందని అక్కడ ఉన్న  ట్రాక్టర్ ను తీసుకొని వెళ్తుండగా నర్సాపూర్ లో ఉన్న  రైతులకు సమాచారం తెలియడంతో వెంటనే వారు పొలం వద్దకు బయలుదేరారు.

 అచ్చంపేట శివారులో ఫారెస్ట్ అధికారులు ట్రాక్టర్ ను తీసుకొని వస్తుండగా అడ్డుకొని ట్రాక్టర్ పై, ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి యత్నించారు. వారు ఒంటికి నిప్పు పెట్టుకోవడానికి ప్రయత్నించగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకొన్నారు. అనంతరం రూప్ సింగ్, విజయ్ ను ఫారెస్ట్ ఆఫీసర్లు వారి వాహనంలో ఎక్కించుకొని మనోహరాబాద్  ఫారెస్ట్ ఆఫీస్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. ఫారెస్ట్ ఆఫీసర్లు  నర్సాపూర్ పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి  ట్రాక్టర్ ను పీఎస్​కు తరలించారు. ఈ సంఘటన పై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ రైతులు ఫారెస్ట్ భూమిలోకి  జరుగుతూ అక్కడ భూమి సాగుకు ప్రయత్నించడంతో ట్రాక్టర్​ను స్వాధీనం చేసుకున్నామన్నారు.