సుల్తానాబాద్, వెలుగు: సహకార సంఘాలను బలోపేతం చేయడం ద్వారా రైతులకే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్, కేడీసీసీబీ డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్ అన్నారు. సుల్తానాబాద్ లో రూ.1.10కోట్లతో నిర్మించిన గోదాములను, ఆఫీస్ పైఅంతస్తు భవనాన్ని ఆయన సోమవారం ఉదయం ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల సహకారంతో సుల్తానాబాద్సొసైటీ అభివృద్ధి చెందిందన్నారు. సుల్తానాబాద్సొసైటీ సక్సెస్జాతీయస్థాయిలో మార్గదర్శకంగా నిలిచిందన్నారు. సీఈవో బూరుగు సంతోష్, డైరెక్టర్లు, కేడీసీసీబీ అధికారులు, రైతులు పాల్గొన్నారు.