ముత్తారం, వెలుగు : ఇసుక లారీల రాకపోకలతో తమ పంటలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ ముత్తారం మండల కేంద్రంలో రైతులు శుక్రవారం లారీలను అడ్డుకున్నారు. వందలాది ఇసుక లారీలు ఉదయం సాయంత్రం వరకు రాకపోకలు సాగిస్తుండడంతో పంటలపై దుమ్ము
ధూళి పడి దిగుబడి రావడం లేదని వాపోయారు. ఎస్‌ఐ మధుసూదన్ రావు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. దుమ్ములేవకుండా రోడ్లపై వాటర్‌తో స్ప్రే చేయించాలని ఇసుక క్వారీల గుత్తేదారులకు ఎస్‌ఐ సూచించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.