ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు వెళ్లిన మంత్రులకు నిరసన సెగ తగిలింది. పంట నష్టంపై సీఎం కేసీఆర్ సూచనల ప్రకారం ఇవాల(మంగళవారం) నర్సంపేట మండలం ఉప్పల్ తండాలో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి పూర్తిగా నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు వెళ్లారు. అయితే తమను పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు. మంత్రులను నిలదీశారు రైతులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రైతులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో రైతులతో మాట్లాడేందుకు వేసిన టెంట్ దగ్గరకు కూడా రాకుండానే అక్కడ్నుంచి వెనుదిరిగారు మంత్రులు.
మరిన్ని వార్తల కోసం..