కూసుమంచి,వెలుగు : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఎర్రగడ్డతండాలోని భక్తరామదాసు ప్రాజెక్టు మోటార్ ట్రయల్ రన్ నిర్వహించినట్టు ఈఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నీరు తిరుమలాయపాలెం మండలం ఇస్తావత్ తండా వద్ద ఎత్తిపోస్తున్నాయని తెలిపారు.
దీంతో పాలేరులోని నాలుగు మండలాల్లో చెరువులను నింపి ఎస్సారెస్సీ ఆయకట్టు రైతులకు సాగు నీటి ని విడుదల చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో డీఈ రమేశ్‌రెడ్డి, ప్రాజెక్టు మేనేజర్ సురేశ్, ఏఈ ఆయేషా సుల్తానా పాల్గొన్నారు.