నకిలీ విత్తనాలు అమ్మితేకఠిన చర్యలు తీసుకోండి..సర్కార్​కు రైతు కమిషన్ సూచన 

నకిలీ విత్తనాలు అమ్మితేకఠిన చర్యలు తీసుకోండి..సర్కార్​కు రైతు కమిషన్ సూచన 

హైదరాబాద్, వెలుగు: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు విత్తన చట్టంలో సవరణలు చేయాలని ప్రభుత్వానికి రైతు కమిషన్ సూచించింది. ఇటీవల ములుగు జిల్లాలో నకిలీ మొక్కజొన్న విత్తనాలతో గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ప్రభుత్వ పరంగా తీసుకోవా ల్సిన చట్టపరమైన చర్యలపై రైతు కమిష న్ నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్టును శుక్రవారం సెక్రటేరియెట్లో సీఎస్ శాంతి కుమారికి రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులు భవానీ రెడ్డి, భూమి సునీల్, అగ్రికల్చర్​సైంటిస్ట్‌‌‌‌ రామాంజ నేయులు అందజేశారు.

గత బీఆర్ఎస్​ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ల చట్టం లో చేసిన కొన్ని సవరణల వల్ల రైతులకు నష్టం జరుగుతున్నదని అందులో పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ల చట్టం, విత్తన చట్టంలో చేయాల్సిన మార్పులపై పలు సూచనలు చేశారు. కాగా, వ్యవసాయ మార్కెట్ల చట్టంలో కాంట్రాక్టు వ్యవసాయానికి సంబంధిం చిన సెక్షన్ 11ఏలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్పు చేసి, కంపెనీలకు ఎలాంటి బాధ్యత లేకుండా ఆర్గనైజర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ సెక్షన్‌‌‌‌ను సవరించి 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన రూల్​ కొనసాగించాలి.