
సత్తుపల్లి, వెలుగు : నకిలీ విత్తనాలతో మోసపోయామంటూ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన కొందరు రైతులు బుధవారం గంగారం సెంటర్ లో ఆందోళన చేశారు. స్థానిక ఆగ్రోస్ దుకాణంలో తాము వరుణ్ సీడ్ కంపెనీకి చెందిన విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేశామన్నారు. 160 రోజుల పంట కాలం కాగా సగం రోజులకే సగం పంట పొట్ట దశకు చేరిందని వాపోయారు.
ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులు సుమారు 200 ఎకరాలలో పంటను పూర్తిగా నష్ట పోయారన్నారు. సుమారు రూ.50 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే అదుకోవాలంటూ రైతులు కోరారు. కాగా ఇదే విషయమై వ్యవసాయ అధికారులను వివరణ కోరగా పంట నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించామన్నారు.