
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో రైతులు మక్కపంట సాగు చేశారు. శనివారం ఉదయం ఎండ ఎక్కువగా ఉండడంతో మక్కలు ఆరబోశారు. మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో తడిసిపోయాయి. అకస్మాత్తుగా కురిసిన వర్షం రైతులను ఇబ్బంది పెట్టింది. పంటను దక్కించునేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తడిసిపోయిన మక్కలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. -వెలుగు, ఫొటోగ్రాఫర్, నిజామాబాద్