రైతు బిడ్డ .. అప్పుడు 11th ఫెయిల్.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్

రైతు బిడ్డ .. అప్పుడు 11th ఫెయిల్.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్

మధ్యప్రదేశ్ కు చెందిన ప్రియాల్ యాదవ్ ఇండోర్ డిప్యూటీ కలెక్టర్ గా నియమితులయ్యారు.  ఇటీవల విడుదలైన మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్సీ) పరీక్షలో ఆమె ఆరో ర్యాంక్ సాధించారు.  రైతు బిడ్డ అయిన ఈమె పదో తరగతి వరకు టాపర్ గా ఉన్నారు. అయితే  11వ తరగతిలో ఫెయిల్ అయ్యారు. ఫిజిక్స్ లో తాను ఫెయిల్ అయినట్లుగా ఆమె చెప్పుకొచ్చారు.  ఇప్పటి వరకు అదే తన తొలి, చివరి ఫెయిల్యూర్ అని తెలిపారు.   డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తూనే UPSC  పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లుగా ఆమె  చెప్పుకొచ్చారు. 

 నేను గ్రామీణ ప్రాంతం నుండి వచ్చాను, అక్కడ అమ్మాయిలు చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకుంటారు, కానీ మా తల్లిదండ్రులు నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయలేదు.  నా చదువును కొనసాగించడానికి నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. కరోనా కాలంలో చదువుకోవడం చాలా కష్టంగా మారింది, అయితే నేను ధైర్యం కోల్పోలేదని ఇంటర్నెట్‌ద్వారా చదువుతూనే ఉన్నాను అని ప్రియాల్ చెప్పింది.  రోజూ 12 నుంచి 14 గంటలు చదువుకునేదని ప్రియాల్ చెప్పింది . 

ప్రియాల్ 2019లో ఎంపీపీఎస్సీ పరీక్షలో 19వ ర్యాంక్ సాధించి జిల్లా రిజిస్ట్రార్ ఉద్యోగానికి ఎంపికైంది. 2020లో ఆమె తదుపరి ప్రయత్నంలో 34వ ర్యాంకు సాధించి సహకార శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా ఎంపికైంది. ఇప్పుడు 2021 పరీక్షలో  ప్రియల్ యాదవ్ 1500కి 910.25 మార్కులు సాధించి టాప్ 10లో చేరి డిప్యూటీ కలెక్టర్ గా నియమితులైంది.