ఢిల్లీ: ఫిబ్రవరి 13న ఢిల్లీకి మార్చ్ కు రైతులు పిలుపునిచ్చిన క్రమంలో తిక్రీ, సింఘూ సరిహద్దుల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీలోని సింఘూ సరిహద్దులో పెద్ద కంటైనర్లు, సిమెంట్ , ఇనుప బారీకేడ్లు, వాటర్ కెనాన్స్ ఏర్పాటు చేశారు పోలీసులు అధికారులు. రైతుల ఢిల్లీ ఛలో మార్చ్ ను అడ్డుకునేందుకు పంజాబ్ సరిహద్దులను మూసివేసింది. హర్యానా ప్రభుత్వం జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్ ను నిలిపివేసింది.
తమ డిమాండ్ల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చుందుకు పలు రైతు సంఘాలు ఢిల్లీ చలో మార్చ్ ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్ పీ) కల్పించే చట్టం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులు, రైతు కూలీలకు పింఛన్లు, వ్యవసాయ రుణాల మాఫీ, పోలీసు కేసుల ఉపసంహరణ, లఖీంపూర్ ఖేరీ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
2020లో పంజాబ్,హర్యానా, ఉత్తరప్రదేశ్ లకు చెందిన రైతులు భారీ సంఖ్యలో కేంద్ర ప్రభుత్వంపై నిరసనకు ఢిల్లీ వైపు కవాతు వెళ్లారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారీ కేడ్లను ఛేదించుకొని ముందుకు సాగారు.రద్దు చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దు లు సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ లో ఏడాదిపాటు నిరసనలు చేపట్టారు.
రైతు సంఘాలు-కేంద్రం చర్చలు
ఫిబ్రవరి 12న తమ డిమాండ్లపై రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద్ రాయ్ లతో సంయుక్త కిసాన్ మోర్చా(నాన్ పొలిటికల్ ), కార్మిక మోర్చా, కిసాన్ ప్రతినిధి బృందంతో చర్చలు జరపనున్నారు. ఢిల్లీ ఛలో మార్చ్ కు ఒకరోజు ముందు చండీగఢ్ లోని సెక్టార్ 26లోని మహాత్మాగాంధీ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో రైతులతో సమావేశం నిర్వహించనున్నారు.
హర్యానాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు రద్దు
ఫిబ్రవరి 13న రైతుల ఢిల్లీ చలో మార్చ్ ను దృష్టిలో ఉంచుకొని ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెల్ సేవలను , బల్క్ sms లను నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం శనివారం (ఫిబ్రవరి 10) ఆదేశాలు జారీ చేసింది. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, ింద్ హాస్పార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో ఫిబ్రవరి 11 ఉదయం 6 గంటలనుంచి ఫిబ్రవరి 13 రాత్రి 12 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండవు.
పంజాబ్-హర్యానా సరిహద్దు మూసివేత
పంజాబ్ లోని పాటియాలా, హర్యాలోని అంబాలా జిల్లాల మధ్య ఉన్న GT రోడ్ సరిహద్దులో(జాతీయ రహదారి44) శంభు సరిహద్దు వద్ద పంజాబ్ సరిహద్దును మూసివేసింది. అంబాలా , జింద్, ఫతేహాబాద్ జిల్లాల్లో పంజాబ్-హర్యానా సరిహద్దులను కూడా మూసివేశారు.
ఢిల్లీ సరిహద్దు భద్రత కట్టుదిట్టం
ఫిబ్రవరి 13న ఢిల్లీకి మార్చ్ కు రైతులు పిలుపునిచ్చిన క్రమంలో టిక్రీ, సింఘూ సరిహద్దుల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీలోని సింఘూ సరిహద్దులో పెద్ద కంటైనర్లు, సిమెంట్, ఇనుప బారీకేడ్లు, వాటర్ కెనాన్స్ ను పోలీసు అధికారులు ఏర్పాటు చేశారు. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు ల్లో రైతులు బహిరంగ సభలను నిషేధిస్తూ ఢిల్లీ పోలీసులు ఉత్వర్వులు జారీ చేశారు. దేశరాజధాని ఢిల్లీలో నిరసన ప్రదర్శనకు అదనంగా ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీలోకి ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్రక్కులు, వాణిజ్య ప్రవేశాన్ని నిషేధించారు.