బోధన్, వెలుగు: సాలూరా మండలం జాడిజమాల్పూర్సొసైటీ చైర్మన్ దాసరి అంతయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సొసైటీ మహాజన సభ నిర్వహించారు. రైతులందరికీ సకాలంలో రుణామాఫీ చేయాలని సమావేశంలో రైతులు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ సెక్రటరీ స జమ, ఖర్చులను సభ్యులకు చదివి వినిపించారు. సొసైటీ పరిధిలో 217 మంది రుణాలు తీసుకోగా125 మందికే మాత్రమే రుణామాఫీ వచ్చిందని రైతులు తెలిపారు.
మిగిలిన 92 మందికి త్వరలో రుణమాఫీ అందేలా చూడాలన్నారు. సొసైటీ వైస్‌చైర్మన్ అనుషబాయి, కార్యదర్శి శివరామకృష్ణ, డైరెక్టర్లు మరియా కుమార్, ఎం.ఆరోగ్యరాజు, వన్నెల, నర్సింలు, బి.శ్రీనివాస్‌రావు, నార్ల వెంకటేశ్వరరావు, పెద్ద మల్కాబోయి తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట: సింగిల్ విండోలో రైతులు తీసుకున్న పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని, అసైన్డ్‌భూములకు పంటరుణాలు ఇవ్వాలని సింగిల్‌విండో మహాజనసభలో రైతులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. నాగిరెడ్డిపేట మండలం తాండూర్ కిచ్చన్నపేట సింగిల్ విండో చైర్మన్ ఆకిడి గంగారెడ్డి అధ్యక్షతన శుక్రవారం మహాజన సభ నిర్వహించారు.
సింగిల్ విండో ఆదాయ, వ్యయాలను విండో సీఈవో జైపాల్‌రెడ్డి చదివి వినిపించారు. సొసైటీ డెవలప్మెంట్ కోసం చేపడుతున్న పనులను చైర్మన్ గంగారెడ్డి వివరించారు. కార్యక్రమంలో విండో వైస్ చైర్మన్బాబురావు, ఎంపీపీ దివిటి రాజ్‌దాస్, డైరెక్టర్లు దివిటి కిష్టయ్య, వేముల సంగయ్య, సిద్ది రాంరెడ్డి, హనుమా నాయక్, కిషన్‌నాయక్, బన్సీనాయక్, సర్పంచులు బాల్‌రెడ్డి,కృష్ణారెడ్డి పాల్గొన్నారు.