శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించి ఇప్పటికీ నాలుగు నెలలు దాటినా ఇంతవరకు క్షేత్రస్థాయిలో పనులు మొదలు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కాలయాపన చేయొద్దని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు అయితే పసుపు పంట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది.
అలాగే మంచి మద్దతు ధర రైతులకి లభించడంతో పాటు పసుపు ఎగుమతి అవకాశాలు, అంతర్జాతీయంగా మార్కెటింగ్ ఉత్పత్తులపై పరిజ్ఞానం పెంచడంతో పాటు కొత్త పరిశోధనలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. తెలంగాణలో ప్రత్యేక పసుపు బోర్డు ఉండాలని కొన్ని సంవత్సరాల నుంచి రైతులు ధర్నాలు చేస్తూ వచ్చారు. భారత దేశంలో వ్యసాయం రంగాన్ని అభివృద్ధి చేస్తామని పాలకులు మాటల్లో చెప్పడమే కాదు, చేతల్లో చూపాల్సిన అవసరం ఉంది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా త్వరగా పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసి పనులు మొదలు పెట్టాలి.
- కె శ్రావణ్, జనగామ జిల్లా