మాస్టర్​ప్లాన్​పై స్పష్టమైన ప్రకటన చేయాలి: రైతులు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మాస్టర్​ ప్లాన్​రద్దుపై కేసీఆర్​ స్పష్టమైన ప్రకటన చేసి రావాలని బాధిత రైతులు డిమాండ్ ​చేశారు. బుధవారం రెండో రోజు రామేశ్వర్​పల్లిలో రైతు ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో  రైతు ప్రతినిధులు సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు. కేసీఆర్​పై పోటీగా వంద నామినేషన్లు వేస్తామని మరోసారి స్పష్టం చేశారు. 

మాస్టర్​ప్లాన్​ ద్వారా తమకు కలిగిన నష్టాన్ని నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలిసేలా గ్రామగ్రామాన తిరిగి వివరిస్తామన్నారు. భూమిని నమ్ముకొని బతుకుతున్న తమకు నష్టం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. నేడు మీటింగ్​కు కేఏ పాల్​మాస్టర్​ప్లాన్ ​బాధిత రైతుల సమావేశం​గురు వారం సదాశివ్​నగర్​ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో నిర్వహించనున్నారు. దీనికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు  కేఏ పాల్​ వస్తున్నారని తెలిపారు.