ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి ఉద్రికత్త నెలకొంది. హర్యానా, పంజాబ్ మధ్య శంభు సరిహద్దులో నిరసన తెలుపుతున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. శుక్రవారం ( డిసెంబర్ 6) శంభు సరిహద్దు నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ చలో మార్చ్ చేస్తున్న రైతులను గ్రేటర్ నోయిడాలోని పారి చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు రైతులు పెద్దఎత్తున్న ఢిల్లీ వైపు వెళ్తుండంతో వారిని అదుపు చేసే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. సెంట్రల్ ఢిల్లీ వద్ద పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి.
అంబాలలో నిషేధిత ఆజ్ణలు ఉన్నప్పటికీ దాదాపు ఐదు వందల మంది రైతులు శంభు సరిహద్దు నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేపట్టారు. రైతుల ఢిల్లీ చలో మార్చ్ పై ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ..అంబాలలో నిషేధిత ఆజ్ణలు ఉన్నాయి. ఢిల్లీ వైపు వెళ్లేందుకు ఎటువంటి పర్మిషన్ లేదు.. అందుకే రైతులను అడ్డుకున్నామని చెప్పారు.
#WATCH | Police use tear gas to disperse protesting farmers at the Haryana-Punjab Shambhu Border.
— ANI (@ANI) December 6, 2024
The farmers have announced to march towards the National Capital-Delhi over their various demands. pic.twitter.com/sTed7fCxIh
రైతుల ఢిల్లీ మార్చ్ కు కొన్ని గంటల ముందు నుంచే భద్రతా బలగాలు అన్ని సరిహద్దుల్లో మోహరించారు. నోయిడా, గ్రేటర్ నోయిడాతో సహా పలు ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు , బారికేడింగ్ లను ఏర్పాటు చేశారు.
ALSO READ : కొత్తరకం బిజినెస్..స్వచ్ఛమైన గాలిని అమ్ముతున్నరు..!
ఢిల్లీ వైపు పాదయాత్రగా వెళ్తున్న రైతులును పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.. గంటల కొద్దీ వాహనదారులు రోడ్లపై ఉండాల్సి వచ్చింది..
కాగా రైతుల నిరసన కారణంగా అంబాలలలో డిసెంబర్ 9 వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కాలినడకన గానీ, వాహనాల్లో గానీ ఊరేగింపుగా ఢిల్లీ వైపు వెళ్లకూడదని పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. రైతుల ఆందోళనతో శుక్రవారం అంబాల జిల్లాలో ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలను మూసివేశారు.
మరోవైపు ఢిల్లీ వైపు కవాతు చేస్తున్న వెళ్తున్న రైతులను అడ్డుకునేందుకు సింఘూ సరిహద్దు లో కూడా శుక్రవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే వాటర్ కేన్లు, కాంక్రీట్ బారీ కేడ్లు ఏర్పాటు చేశారు.
రైతులు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు?
పంటల కనీస మద్దతు ధర (MSP) కోసం చట్టపరమైన హామీతో పాటు తమ ఇతర డిమాండ్లను నెరవేర్చాలని దేశ రాజధాని ఢిల్లీ కి వెళ్లి కేంద్రానికి విన్నవించాలని సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా రైతులు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 13 నుంచి రైతులు పంజాబ్ , హర్యానా మధ్య శంభు , ఖనౌరీ సరిహద్దు పాయింట్లలో ఉన్నారు.
MSPతో పాటు, రైతులు వ్యవసాయ రుణమాఫీ, రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్, విద్యుత్ ఛార్జీల పెంపుదల, రైతులపై పోలీసు కేసుల ఉపసంహరణ, 2021 లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం కూడా డిమాండ్ చేస్తున్నారు.
2013 భూసేకరణ చట్టం పునరుద్ధరణ, 2020--21లో గతంలో జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడం కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు.