
భూదాన్ పోచంపల్లి వెలుగు: కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని కంపవేసి రైతులు బుధవారం రాస్తారోకో చేశారు. భూదాన్ పోచంపల్లి మండలం జులూర్ కేంద్రంలో నాలుగు రోజుల నుంచి చిన్న రైతుల ధాన్యం కొనుగోలు చేయడం లేదని, కేవలం పెద్ద రైతులకు మాత్రమే లారీలు లోడ్ చేసి రైస్ మిల్లు కు పంపిస్తున్నారని వాపోయారు. మంగళవారం కురిసిన వర్షానికి వడ్లు తడిసిపోయాయని అన్నారు. తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పీఏసీఎస్ చైర్మన్ అందేలా లింగం యాదవ్ ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.