
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో ఆఫీస్ ముందు రైతులు ధర్నా చేపట్టారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో త్రిబుల్ ఆర్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయామని వాపోయారు. గజ్వేల్ నియోజకవర్గంలో త్రిబుల్ ఆర్ కు సంబంధించి అలాట్మెంట్ వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. ఈ అలాట్మెంట్ మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కు అనుకూలంగా చేసుకున్నారని కేసీఆర్ దత్తత గ్రామం నర్సన్నపేట గ్రామస్థులు ఆరోపించారు.
ఎకరానికి 7 లక్షల 50 వేల రూపాయలు ఇస్తామని.. ఇవ్వడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ ఆఫీస్ గేటు ముందు కలెక్టర్ డౌన్ డౌన్, ఆర్డీవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. అయినా తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని.. తమకు న్యాయం చేయకపోతే ఊరుకోమని హెచ్చరించారు.